ఫేక్‌ వీడియోలు వైరల్ కావచ్చు..కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి..కేటీఆర్ పిలుపు!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థులు డీప్‌ ఫేక్ వీడియోలను ప్రచారం చేయోచ్చని కేటీఆర్‌ పార్టీ నేతలకు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

New Update
KTR: ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయి...కేజ్రీవాల్‌ అరెస్ట్‌ పై కేటీఆర్‌!

తెలంగాణ ఎన్నికలకు ఇంకా 6 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలన్ని కూడా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. నేతలందరూ కూడా నేరుగా ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మినిస్టర్‌ కేటీఆర్‌ సోషల్‌ మీడియా ద్వారా పార్టీ కార్యకర్తల్ని , సోషల్‌ మీడియా యాక్టివర్స్‌ ను అప్రమత్తం చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఈ 6 రోజుల్లో అనేక తప్పుడు, డీప్‌ ఫేక్‌ వీడియోలు బయటకు వస్తాయని తెలిపారు. అసత్య ఆరోపణలు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తారని తెలిపారు.

ఎవరూ కూడా ఈ మోసపు వలలో చిక్కుకోవద్దని కోరారు. ఓటర్లను కూడా వారి బారి నుంచి కాపాడాలని తెలిపారు. డీప్‌ ఫేక్‌ కంటెంట్‌ గురించి చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం కూడా దీని గురించి హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా కేటీఆర్‌ కూడా దీని గురించి మాట్లాడటం ప్రస్తుతం చర్చానీయాంశం గా మారింది.

Also read: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు..మరో రెండు రోజుల పాటు కురిసే ఛాన్స్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు