TS Congress: ఈ రాత్రికే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. కానీ ఓ బిగ్ ట్విస్ట్? తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదలకు ఆ పార్టీ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. ఈ రోజు జరుగుతున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సోనియాగాంధీ మల్లికార్జున ఖర్గే , కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ రోజు రాత్రికి సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. By Manogna alamuru 25 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కాంగ్రెస్ రెండో జాబితాలో చోటు కోసం అభ్యర్థుల నుంచి పోటీ చాలా ఎక్కువగా ఉంది. దీని మీద కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో సమావేశమయిన కమిటీ ఈరోజు సెకండ్ లిస్ట్ ను తయారు చేసి రాత్రికి విడుదల చేస్తుందని తెలుస్తోంది. సోనియాగాంధీ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి లిస్ట్ ప్రిపరేషన్ కు రాహుల్ గాంధీ లేరని చెబుతున్నారు.సుమారు 30 మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేయనుంది. మొత్తం లిస్ట్ ఇప్పుడే ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా కాకుండా ఈ రోజు కేవలం 30 మందితో మాత్రమే సెకండ్ లిస్ట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దీన్ని బట్టి మూడు నాలుగు జాబితాలు కూడా ఉందని తెలుస్తోంది.నవంబర్ మూడు నాటికి చివరి జాబితా ప్రకటించొచ్చని తెలుస్తోంది. Also Read:గాజాలో మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి-ఐరాసలో భారత్ మొదటి సెకండ్ లిస్ట్ లోనే అందరు అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే కొన్ని స్థానాలు ఎవరికి ఇవ్వాలని అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు హైకమాండ్. దానికి తోడు కాంగ్రెస్ లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. దీంతో పాటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్లుండి పార్టీలో జాయిన్ అవుతారని తెలుస్తోంది. అలాగే వివేక్ కూడా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. వారు జాయిన్ కాకుండా లిస్ట్ లో పేర్లు ప్రకటించడం బాగోదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెకండ్ లిస్ట్ లో మొత్తం అన్ని పేర్లు ప్రకటించకుండా.. ఇప్పుడు 30 మంది పేర్లను అనౌన్స్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ రెండో జాబితాలో చోటు కోసం విపరీతంగా పోటీ నెలకొంది. ఎల్లారెడ్డి, ఎల్బీ నగర్. మిర్యాలగూడ, వైరా, బాన్సువాడ, తుంగతుర్తి, భువనగిరి, మక్తల్, హుస్నాబాద్, హుజూరాబాద్, భోథ్ నియోజకవర్గాల్లో టికెట్ ఆశించే వారి నడుమ గట్టి పోటీ ఉందని తెలుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కీ, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ టికెట్లు ఆశిస్తున్నారు. తమ పేర్లను ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించకపోవడంపై వీరు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీంతో పాటూ హుస్నాబాద్, మునుగోడు, పాలేరు, చెన్నూరు స్థానాల్లో వామపక్షాలు-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. రెండు పార్టీల మధ్య పొత్తులు, సీట్ల విషయం కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. #congress #telangana #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి