/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ponguleti-Srinivasreddy-jpg.webp)
తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. బీసీ నేతలు, ఓయూ విద్యార్థులు, మహిళా నేతలు తమకు తగిన సంఖ్యలో సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు మరికొంత మంది ముఖ్య నేతలు తమతో పాటు అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Khammam Ex MP Ponguleti Srinivas Reddy) కూడా తన వర్గానికి చెందిన 15 మందికి టికెట్ల ఇవ్వాలంటూ ఈ రోజు అగ్రనేతలను కలవనున్నారు. ఈ రోజు ఆయన ? వెళ్లారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తో పాటు ఏఐసీసీ అగ్రనేతలతో ఆయన భేటీ కానున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: కాంగ్రెస్ 63 మంది అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే?
రాష్ట్ర వ్యాప్తంగా తాను ప్రతిపాదించిన 15 స్థానాల అభ్యర్థిత్వంపై చివరిసారిగా పొంగులేటి ఈ రోజు చర్చించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆరు స్థానాలకు తాను ప్రతిపాదించిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని పొంగులేటి కోరనున్నట్లు తెలుస్తోంది. ఓయూ జేఏసీ కోటాలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పిడమర్తి రవి, మాదిగ సామాజిక వర్గ కోటాలో సత్తుపల్లి నుంచి కోడూరు సుధాకర్ పేర్లను ఆయన ప్రతిపాదిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!
ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొంగులేటి ప్రతిపాదిత స్థానాల్లో పార్టీ సీనియర్ నేతలు భట్టి, రేణుకాచౌదరి అనుచరులు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. తాను ప్రతిపాదించిన స్థానాల విషయంలో అధిష్టానం సానుకూలంగా స్పందిస్తున్న ధీమాను పొంగులేటి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒక వేళ తాను అడిగినన్ని టికెట్లు తన వారికి కేటాయించకపోతే పొంగులేటి ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఉత్కంఠగా మారింది.