TS Congress Election Promises: స్టూడెండ్స్ కు ఫ్రీగా ఇంటర్నెట్, రూ.5 కే జాబ్ అప్లికేషన్.. కాంగ్రెస్ సంచలన హామీలివే?

కాలేజీ విద్యార్థులకు ఫ్రీగా ఇంటర్నెట్ అందించాలన్న హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కేవలం రూ.5/రూ.10 కి తగ్గిస్తామని మరో హామీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.

TS Congress Election Promises: స్టూడెండ్స్ కు ఫ్రీగా ఇంటర్నెట్, రూ.5 కే జాబ్ అప్లికేషన్.. కాంగ్రెస్ సంచలన హామీలివే?
New Update

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించి వారిని తమవైపు తిప్పుకుంటోంది. దీంతో పాటు అన్ని వర్గాలను తన వైపు తిప్పుకునేలా హామీలు ఉండాలని భావిస్తోంది హస్తం పార్టీ. ఎలాంటి హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లి తమకు ఓట్లు కుమ్మరిస్తాయో వెతికే పనిలో నిమగ్నమయ్యారు హస్తం ముఖ్యనేతలు. ఇందులో భాగంగా కాలేజీ విద్యార్థులకు ఫ్రీగా ఇంటర్నెట్ అందించాలన్న హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వందలు, వేలల్లో ఫీజు ఉండడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Telangana: యుద్ధం మొదలైంది.. ట్విట్టర్ వేదికగా రచ్చ రచ్చ చేస్తున్న కేటీఆర్, రేవంత్, కోమటిరెడ్డి..

ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ దరఖాస్తు ఫీజు కేవలం రూ.5/రూ.10 మాతమ్రే ఉంటుందన్న హామీని కూడా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇంకా ఆటో డ్రైవర్లను ఆకర్షించడమే లక్ష్యంగా వారి కోసం కూడా ఓ పథకాన్ని రూపొందించనుంది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ. శుక్రవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీకి మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, గడ్డం ప్రసాద్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా విద్యార్థులు, యువకుల కోసం ఎలాంటి పథకాలు రూపొందించాలి అన్న కోణంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా అక్టోబర్ 2వ తేదీన ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించి ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలని కమిటీ నిర్ణయింనుంది. రానున్న రోజుల్లో మరిన్ని హమీలను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం జరుగుతున్న చేరికలు ముగిసిన తర్వాత మేనిఫెస్టో, హమీలను విడుదల చేయనుంది హస్తం పార్టీ.

#congress-party #telangana-election-2023 #revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe