TS Jobs : తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో ఏకంగా రెండు లక్షల జాబ్స్!

ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది యువతకు ఉపాధి లభించనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ నియామకాలు ఉండే అవకాశం ఉంది.

TS Jobs : తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో ఏకంగా రెండు లక్షల జాబ్స్!
New Update

2 Lakhs Jobs Notification : త్వరలో తెలంగాణ లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్(Telangana Government) సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అమలవుతున్న ఈ వ్యవస్థను ఇక్కడికి తీసుకురావడం ద్వారా లక్షల మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు(Government Schemes), కార్యక్రమాలు సులభంగా చేరుతాయన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నిక(Parliament Elections) ల తర్వాత వాలంటీర్ల నియామకంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించే అవకాశం ఉందని సచివాలయంలో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ విషయమంపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Breaking : టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

తెలంగాణలో గత ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ సంఖ్య ఇప్పుడు దాదాపు కోటికి చేరే అవకావం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో మాదిరిగా ఇక్కడ 50 నివాసాలకు ఒక వాలంటీర్ చొప్పున నియమిస్తే దాదాపు 1.50 లక్షల నుంచి 2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

అయితే.. ఏపీ(Andhra Pradesh) లో మాదిరిగా ఇక్కడ కూడా ఒక్కో వాలంటీర్ కు రూ.5 వేల చొప్పున చెల్లిస్తారా? ఆ మొత్తాన్ని పెంచుతారా? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏపీలో వాలంటీర్లకు టెన్త్ విద్యార్హతగా ఉంది. ఇక్కడ కూడా అదే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

#andhra-pradesh #parliament-elections-2024 #telangana-government-schemes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe