ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) దారుణ ఓటమి తర్వాత అలర్ట్ అయిన బీజేపీ (BJP) నాయకత్వం.. ఇందుకు గల కారణాలు ఏంటి అనే అంశంపై దృష్టి సారించింది. పార్టీలోనే ఉంటూ నష్టం చేసే వారిని గుర్తించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ సంఘం భేటీ అయ్యింది. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు నేతృత్వంలో సమావేశమైంది. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగుతోందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: BRS: కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో బీఆర్ఎస్ సంచలన బుక్లెట్
పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. క్రమశిక్షణ ఉల్లంఘిచిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసమ్మతి నేతల రహస్య సమావేశాలపై జిల్లాల వారీ నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా పార్టీ నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని నేతలు చెబుతున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరుపై క్రమశిక్షణ కమిటీ భేటీలో చర్చ జరిగింది. ఇంకా.. సోషల్ మీడియా వార్ పై కూడా కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎన్నికల నాటికి పార్టీలో ఉన్న డిస్ట్రబెన్స్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా క్రమశిక్షణ సంఘం వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.