కేసీఆర్ వరాల జల్లు కురిపించనున్నారా? ఇవాళ అసెంబ్లీలో సీఎం ఏం మాట్లాడుతారన్నదానిపై ఉత్కంఠ! ఇవాళే అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం ప్రసంగిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు వరాల జల్లు కురిపిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్‌సీ, ఐఆర్ గురించి కీలక ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. By Trinath 06 Aug 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి ఇవాళే(ఆగస్టు 6) అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. మరో రెండు మూడు నెలల్లో తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల సమయానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్నది పక్కన పెడితే ప్రస్తుతం మంత్రివర్గానికి ఇదే లాస్ట్ అసెంబ్లీ మీటింగ్ డే. అందుకే ఇవాళ గులాబీ సర్కార్‌కి కీలకం. ఎన్నికలకు ముందు జరగనున్న అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో సీఎం కేసీఆర్(CM KCR) సభలో సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశముంది. ఈ ప్రసంగంలో కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నదానిపై యావత్ తెలంగాణ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఈ ప్రసంగంపైనే ఉంది. IR, PRC లాంటి వాటిపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని వారంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టార్గెట్ కాంగ్రెస్ ? శాసనసభ, మండలిలో ఆదివారం జరిగే చివరిరోజు సమావేశాల్లో ‘రాష్ట్రం ఏర్పాటు- స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’ అనే అంశంపై చర్చ జరగనుండగా.. సీఎం స్పీచ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ ప్రసంగం ద్వారా కేసీఆర్ తన విమర్శకులకు సమాధానమిస్తారని సమాచారం. రానున్న ఎన్నికలతో హ్యాట్రిక్ విక్టరీపై ఫోకస్ చేసిన సీఎం.. రాష్ట్ర ప్రజలకు మరిన్ని హామీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతిపక్షాలు అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నాయన్న విషయాన్ని కేసీఆర్ ఈ ప్రసంగం ద్వారా ప్రజలకు చెబుతారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు గత తొమ్మిదేళ్లలో తెలంగాణను వివిధ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలపడానికి బీఆర్‌ఎస్ చేసిన కృషిని ప్రజలకు కేసీఆర్ వివరిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వరాల జల్లు కురిపిస్తారా ? అటు ప్రత్యర్థి పార్టీల కంటే ఎక్కువగా కేసీఆర్ స్పీచ్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ ఐదేళ్ల ప్రభుత్వ కాలానికి ఇదే చివరి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఉద్యోగుల కోసం కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారని వారంతా ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపునకు ఉద్యోగుల ఓట్లు కూడా కీలకం కావడంతో సీఎం వారి సమస్యల పరిష్కారానికి కచ్చితమైన హామీలు ఇచ్చే ఛాన్స్ ఉంటుందని అటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. పీఆర్‌సీ(PRC)ని ప్రకటిస్తారని.. ఐఆర్ గురించి కూడా కేసీఆర్ ప్రకటన ఉంటుందని జోస్యం చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పాటైన తొలి పీఆర్‌సీ కాలం గత జూన్ 30తో ముగియగా.. ఆ తర్వాత వేతనాలు పెరగలేదు. దీంతో ఉద్యోగ సంఘ నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఇవాళ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ ఓవర్ సిక్సులు? ఈ నాలుగు రోజుల సమావేశాల్లో కేసీఆర్ కాసేపు మాత్రమే అసెంబ్లీలో కనిపించారు. ఇటీవల మరణించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి. సాయన్నకు నివాళులు అర్పించేందుకు గురువారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవానికి గంటపాటు మాత్రమే హాజరయ్యారు. ఈ మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో కనిపించని కేసీఆర్.. చివరి రోజు వ్యూహం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. లాస్ట్ ఓవర్‌లో హిట్టింగ్ చేసి ప్రజల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. #cm-kcr #employees #ts-assembly #prc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి