America: అమెరికాలో నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు రోజురోజుకి హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.
ట్రంప్‌నకు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ మొదటి నుంచి తన పూర్తి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్రంప్‌ను మస్క్ ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ తరువాత నుంచి వారిద్దరి మధ్య స్నేహబంధం రోజురోజుకూ మరింత బలపడుతోంది. మరోసారి తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఇస్తానని ట్రంప్ తాజాగా ప్రకటించారు.
తన కేబినెట్లో చోటు ఇస్తానని చెప్పారు. అలా కానిపక్షంలో సలహాదారుడిగానైనా నియమించుకుంటానని తెలిపారు. ట్రంప్ ఆఫర్‌పై మస్క్ సానుకూలంగా స్పందించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మస్క్ తెలిపారు.