No Petrol and Diesel:ట్రక్ డైవర్ల సమ్మె-బంకుల్లో నిలిచి పోయిన పెట్రోల్, డీజిల్

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్‌లో పెట్రోలు బంకుల ముందు వాహనదారుల క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ యజమానుల ధర్నా చేస్తుండడంతో వీటి సరఫరా ఆగిపోయింది.

No Petrol and Diesel:ట్రక్ డైవర్ల సమ్మె-బంకుల్లో నిలిచి పోయిన పెట్రోల్, డీజిల్
New Update

Truck Drivers Strike:ఇండియన్ పీనల్ కోడ్‌ను మారుస్తూ కొత్త న్యాయసంహిత అనే చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తాలూకా బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు ఇందులో నిబంధనలు కొన్ని తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్రక్ యజమానులు, డైవర్లు ఆందోళనకు దిగారు. ఆ రూల్స్‌ను తొలగించాలని కోరుతూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతున్నారు. ఇది ఇప్పుడు రెండో రోజుకు కూడా చేరుకుంది. దీంతో గ్యాస్, పెట్రోలు, డీజిల్ లాంటి నిత్యావసరాల సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.నిత్యావసరాల ధరలకు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

Also Read:కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తున్నాం-కిషన్ రెడ్డి

కొత్తగా రానున్న భారతీయ న్యాయ సంహిత చట్టంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కఠిన నిబంధనలను చేర్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బాధితులను అక్కడే వదిలేయడం, కనీసం పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా పారిపోవడం లాంటివి చాలా మంది చేస్తారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు...హిట్ అండ్ రన్ వాహనాల యజమానులకు సంబంధించి కఠినమైన జరిమానాలను కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త చట్టం ప్రకారం ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పుడే ఈ రూల్‌నే ట్రక్ డైవర్లు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

పెట్రోల్ బంద్...

ట్రక్ డైవర్ల సమ్మెతో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్‌లో పెట్రోలు బంకుల ముందు వాహనదారులు క్యూలు కడుతున్నారు. ట్రక్ డైవర్ల సమ్మె గురించి తెలియక పెట్రోల్ బంక్ యజమానులు ఫుల్ స్టాక్ పెట్టుకోలేదని చెబుతున్నారు. దీంతో ఉన్న స్టాక్ అయిపోవడంతో చాలా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎల్పీజీ సిలెండర్ల కొరత కూడా చాలా ఎక్కువగానే ఉంది. లారీ డ్రైవర్లు ప్లాంటుకు రిపోర్డు చేయకపోవడంతో పంపిణీ జరగలేదని చెబుతున్నారు.

ప్రస్తుతం సమ్మె వలన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ల మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అక్కడ రహదారుల మీద వాహనాలు కూడా భారీగా నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. అహ్మదాబాద్-వడోదర హైవే మీద ౧౦ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పాటూ అక్కడ ఆర్టీసీ బస్సులను కూడా నిరసకారులు అడ్డుకుంటున్నారు.

#diesel #petrol #strike #truck-drivers
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe