నోటి పూత సమస్యలు చాలా మందిని వేధిస్తూంటాయి. చలికాలంలో ఎక్కువగా అవ్వటానికి ప్రధాన కారణం నీటి, గాలిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. దీని వలన నోటిపూత ఎక్కువగా వస్తుంది. ఇలాంటి సమస్య చిన్న నుంచి పెద్దల వరకూ అందరిని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇలా నోటిపూత వచ్చినప్పుడు బ్రష్ చేయడానికి, తినడానికి, నీళ్లు తాగలన్న ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. జీర్ణ సమస్యలు, ఒత్తిడి, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలుంటే నోటిపూత అధికంగా వస్తుంది. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఇంటి చిట్కాలతో పరిష్కారం లభిస్తుంది. అదెలాగో ఇప్పుడు చుద్దాం.
పసుపు:
పసుపులో యాంటీ వైరల్, బ్యాక్టీరియల్ వంటి గుణాలు ఎక్కువ. నోటి పూతపై పసుపు పెట్టినా.. గోరు వెచ్చని నీటిలో పసుపు వేసి పుక్కిలించినా సమస్యకి మంచి ఫలితం వస్తుంది.
తులసి ఆకులు:
తులసి ఆకులు నోటి పూతను త్వరగా తగ్గిస్తాయి. రోజూ తులసి ఆకులను నమలడం వల్ల నోటి పూతనే సమస్య పోయి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నోటి దుర్వాసన పోయి నోట్లో క్రిములు, బ్యాక్టీరియా ఉన్నా నశిస్తుంది.
లవంగాల నూనె:
లవంల నూనెతో నోటి పూతను తగ్గించడంతో అద్భతంగా పనిచేస్తుంది. నోటి పూత ఉన్న దగ్గర లవంగాల నూనెను రాసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ట్రీట్రీ ఆయిల్:
ట్రీట్రీ ఆయిల్‌లో కాటన్ బాల్స్ చుట్టి బొబ్బలు ఉన్న చోట పెట్టి మౌత్ అల్సర్‌ను తగ్గించు కోవచ్చు.
నెయ్యి:
నోటి పూత ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు నెయ్యి రాసుకోవాలి. ఉదయం లేవగానే కడిగేసుకోవాలి. అలాగే రోజుకు రెండు సార్లు నోటిని కడిగితే సమస్య పోతుంది.
పెరుగు:
నోటి పూతగా వచ్చిన్నప్పుడు పెరుగును ఎక్కువగా తినాలి. పెరుగులో యాంటీ బ్యాక్టీరియా నోటి పూతను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీని వలన చల్లదనాన్ని, కడుపు వేడి తగ్గి నోటి పూత త్వరగా తగ్గుతుంది.
తేనె:
తేనె నోటి పూతను తగ్గాటానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉంటే యాంటీ బ్యాక్టీరియా, వైరల్ గుణాలు ఎక్కువ. తేనెని పూతపై రాసే మంట తగ్గి చల్లగా ఉంటుంది. అలాగే.. గోరు వెచ్చటి నీటినిలో ఉప్పు వేసి పుక్కిలించినా నోటిపూత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: హైబీపి వేధిస్తుందా..? ఇంగువతో ఈ వ్యాధులు పోతాయని తెలుసా..?