Trisha: 'ఐ యాం సారీ' వెనక్కి తగ్గిన మన్సూర్.. త్రిషా రియాక్షన్‌ ఇదే!

త్రిషాపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌లో అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో మన్సూర్‌ త్రిషాకు బహిరంగంగా సారీ చెప్పాడు. మన్సూర్ సారీపై త్రిషా రియాక్ట్ అయ్యింది. తప్పు చేయడం మానవ లక్షణమని.. క్షమించడం దైవంతో సమానమని ట్వీట్ చేశారు.

New Update
Movies:ఇతని పొగరు మామూలుగా లేదుగా..అన్నంతపనీ చేసేసాడు

కొన్ని రోజులుగా తమిళనటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌(Mansoor Ali Khan)పై యావత్‌ సినీ లోకం విమర్శలు గుప్పిస్తోంది. స్టార్ హీరోయిన్ త్రిషా(Trisha)పై మన్సూర్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మన్సూర్‌ ఆలీ ఓ ఇంటర్వ్యూ లో లియో సినిమా గురించి మాట్లాడారు. 'లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నా..అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాల్లో ఒక్క సన్నివేశం అయినా బెడ్‌ రూమ్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నా.. కానీ మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో త్రిషను బెడ్‌ రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో రేప్‌ సీన్లు చేశాను. ఈ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌ లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో కనీసం సెట్స్‌ లో త్రిషను నాకు చూపించలేదు..' అంటూ మన్సూర్‌ కామెంట్స్‌ చేశాడు. దీనిపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రాగా.. ఎట్టకెలకు మన్సూర్ క్షమాపణ చెప్పాడు.

publive-image మన్సూర్ అలీ ఖాన్ తమిళంలో రిలీజ్ చేసిన స్టేట్మెంట్

ఐ యాం సారీ:
మన్సూర్ అలీ ఖాన్‌ తమిళంలో సారీ చెబుతూ ఓ స్టెట్‌మెంట్ రిలీజ్ చేశాడు. వారం రోజులుగా యుద్ధంలో ఉన్నానని.. తనకు మద్దతుగా నిలిచిన నాయకులు, నటీనటులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఖండించిన వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. త్రిషపై తన వ్యాఖ్యలు తనను కూడా బాధపెట్టాయని అంగీకరించాడు. 'నా సహనటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి' అని నోట్ రిలీజ్ చేశాడు.


రియాక్ట్ అయిన త్రిష:
మన్సూర్‌ అలీ ఖాన్‌ క్షమాపణపై త్రిష స్పందించారు. తప్పు చేయడం మానవ లక్షణమని.. క్షమించడం దైవంతో సమానమని ట్వీట్ చేశారు. నిజానికి మన్సూర్ గతంలో క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. అయితే అతనిపై విమర్శలు ఆగలేదు. జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఈ విషయంలో సీరియస్‌ అయ్యింది. ‘ ఈ విషయాన్ని మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం. మన్సూర్ వ్యాఖ్యలు మహిళలపై హింసను ప్రేరేపించేలా ఉన్నాయి. ఇలాంటి అసభ్యకరమైన మాటల్ని ఏమాత్రం సహించేదిలేదు.ఐపీసీ సెక్షన్‌ 509బీ తో పాటు సంబంధిత సెక్షన్ల కింద మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశించాం’ అని జాతీయ మహిళా కమిషన్‌ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. అటు మెగాస్టార్‌ చిరంజీవి దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ల వరకు త్రిషకు అండగా నిలబడడంతో మన్సూర్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.

Also Read: అతి జాగ్రత్తే కొంపముంచింది.. ఇండియా చేసిన ఐదు తప్పిదాలివే!

WATCH:

Advertisment
తాజా కథనాలు