Animal Actress Tripti Dimri Buys A New House : బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో (Animal Movie) ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి దిమ్రి. సినిమాలో ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసి యూత్ ఫేవరేట్ గా మారింది. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబై లో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందట. స్టార్ సెలెబ్రిటీలు ఉండే ఏరియాలో ఉన్న ఆ ఇంటికి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Tripti Dimri : రణ్ బీర్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న’యానిమల్’ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా?
'యానిమల్' బ్యూటీ త్రిప్తి దిమ్రి తాజాగా ముంబై బాంద్రా లో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇది రెండంతస్థుల ఇల్లు. సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఇంటి కోసం రూ.14 కోట్లు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కొత్తింట్లో అడుగుపెట్టబోతోందట.
Translate this News: