Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కుతుందా? ఈ ట్రిక్స్‌ తెలుసుకుంటే ఆ సమస్య ఉండదు!

మీ మొబైల్‌కు వేరొకరి ఛార్జర్ ఉపయోగిస్తుంటే ముందు మానేయండి. మరోకరి మొబైల్‌ ఛార్జర్‌తో మన ఫోన్‌ బ్యాటరీ వేడెక్కుతుంది. ఇక ఎక్కువ బ్రైట్‌నెస్‌ పెట్టుకోవడం వల్ల బ్యాటరీ హీట్ అవుతుంది. బయటి వేడి నుంచి ఫోన్‌ను రక్షించండి.

New Update
Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కుతుందా? ఈ ట్రిక్స్‌ తెలుసుకుంటే ఆ సమస్య ఉండదు!

Smart Phone: చలికాలం వచ్చేసింది. చలికాలంలో కూడా ఫోన్ వేడెక్కడం మొదలైతే ఏం చేయాలి..? అనేక కారణాల వల్ల ఫోన్ వేడెక్కుతుంది. కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కస్టమర్ సపోర్ట్‌కు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పరిష్కారం పొందవచ్చు. హాట్ ఫోన్‌ను చల్లబరచడానికి ఏయే ట్రిక్స్ ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

ఈ టిప్స్‌ తెలుసుకోండి:

ప్రత్యక్ష సూర్యకాంతిలో ఫోన్ వేడెక్కుతుంది. శీతాకాలంలో ఇలాంటి సమస్య తలెత్తదు. కానీ శీతాకాలంలో ప్రజలు బ్లోయర్లు, హీటర్లను ఉపయోగిస్తారు. అవి ఉన్న స్పాట్‌లో ఫోన్ వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ బ్రైట్‌నెస్‌తో నడపడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి బ్యాటరీపై తక్కువ లోడ్ ఉండేలా బ్రైట్ నెస్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఇది కూడా చదవండి: చెడు వాసన.. మురికిగాలి.. ఇక జీవించడం కష్టమే.. బాంబు పేల్చిన సైంటిస్టులు!

మీరు వేరొకరి ఛార్జర్ ఉపయోగిస్తుంటే ముందు మానేయండి. మరో ఛార్జర్‌తో బ్యాటరీ వేడెక్కుతుంది. కంపెనీ అందించిన ఫోన్ ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించండి. పాత ఛార్జర్ వాడితే ప్రమాదం.కొన్ని యాప్స్ స్మార్ట్ ఫోన్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీకు తెలియజేస్తుంది. దీని వల్ల ఎక్కువ డేటా, బ్యాటరీ ఖర్చవుతాయి. కాబట్టి, యాప్ అవసరం లేకపోతే దాన్ని అన్ఇన్‌స్టాల్‌ చేయండి లేదా నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఫోన్ హాట్‌గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కవర్ కారణంగా వేడి బయటకు రాదు. మీ ఫోన్ చాలా వేడిగా ఉంటే కవర్ తొలగించండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: తగినంత నిద్ర తర్వాత కూడా అలసటగా అనిపిస్తుందా? అప్రమత్తంగా ఉండండి!

Advertisment
తాజా కథనాలు