Tribal Welfare Officer Jaga Jyoti Arrested: బిల్లు మంజూరు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB) అడ్డంగా దొరికిన గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్(ఎస్‌ఈ) కె.జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరుస్తుండగా అస్వస్థతకు గురైంది. దీంతో ఉస్మానియాలో (Osmania Hospital) వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, రేపు జ్యోతిని రిమాండ్‌కు తరలించనున్న అధికారులు తెలిపారు.
రూ.15 కోట్ల అక్రమ ఆస్తులు..
ఈ మేరకు నాగ జ్యోతి వద్ద రూ.15 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు తేల్చారు. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : Crime: సినిమా చాన్స్ ఇప్పిస్తానని వాడుకున్నాడు.. సీక్రెట్ గా శృంగార వీడియోలు తీశాడు
అసలేం జరిగింది..
గంగన్న అనే కాంట్రాక్టర్‌కు నిజామాబాద్‌లో పూర్తిచేసిన పనికి బిల్లు మంజూరవ్వగా.. హైదరాబాద్ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్ బాలుర వసతిగృహం కాంట్రాక్టునూ ఆయనే దక్కించుకున్నారు. నిజామాబాద్‌లో పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించేందుకుగాను జగజ్యోతి లంచం డిమాండు చేశారు. దీనిపై కాంట్రాక్టర్ గంగన్న అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అనిశా అధికారులు మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో రూ.84 వేలు లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.