e-Challan Scam: జాగ్రత్త! ఈ-చలాన్ పేరిట భారీ స్కామ్..
వియత్నాంకు చెందిన హ్యాకర్లు Maorisbot అనే సాంకేతిక మాల్వేర్ సహాయంతో భారతీయ వాట్సాప్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ-చలాన్ మోసాలకు పాల్పడుతున్నారని ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది.
వియత్నాంకు చెందిన హ్యాకర్లు Maorisbot అనే సాంకేతిక మాల్వేర్ సహాయంతో భారతీయ వాట్సాప్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ-చలాన్ మోసాలకు పాల్పడుతున్నారని ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది.
దివ్యాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు బాలలత మండి పడ్డారు. ఆమె దివ్యాంగులకు క్షమామణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు.
ఏపీ అసెంబ్లీ వేదికగా సంచలన దృశ్యం కనిపించింది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి మాట్లాడారు. తరువాత ఆయన చెవిలో ఎదో చెప్పారు. దీంతో జగన్ సీరియస్ రియాక్షన్ ఇచ్చారు. RRR అసెంబ్లీలో జగన్ కు వార్నింగ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు
కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే రోజు దగ్గరకొచ్చేసింది. ఒక్కరోజు గడిస్తే బడ్జెట్ లో ఏముందో.. ఎలా ఉంటుందో తేలిపోతుంది. ఈలోగా అన్ని రంగాల నుంచి అంచనాలు చాలా ఉన్నాయి. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బు 6 వేల నుంచి 8వేలకు పెంచవచ్చని ఆశిస్తున్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి మరింత టాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరుతున్నాయి. దీనివలన హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రజలు మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ 2024లో పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. టీడీపీ సభ్యులు పచ్చ చొక్కాలతో సమావేశాలకు హాజరు కాగా.. జగన్ తో సహా వైసీపీ సభ్యులు నల్ల కండువాలతో సభకు హాజరయ్యారు. సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
మరికొద్దిసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ తో పాటు ఆరు ముఖ్యమైన బిల్లులు ఈ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువస్తారు. ఈరోజు మధ్యాహ్నం పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే ప్రవేశపెడతారు.
ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆర్థిక మంత్రి రేపు అంటే జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు బాయిలర్ బిల్లు, కాఫీ (ప్రమోషన్-అభివృద్ధి) బిల్లు, రబ్బరు (ప్రమోషన్-అభివృద్ధి) వంటి ఆరు బిల్లులు కూడా సభ ఆమోదం కోసం రానున్నాయి.
ఆర్థిక సర్వే రిపోర్ట్ ను బడ్జెట్‌కు ఒక రోజు ముందు పార్లమెంటులో ప్రవేశ పెడతారు. ఈరోజు బడ్జెట్ - 2004 ఆర్ధికసర్వే రిపోర్టు రానుంది. దీనిని ప్రతి సంవత్సరం ఆర్థిక సలహాదారు నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేస్తుంది. దానిని పార్లమెంటులో ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.