/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/balalatha-smitha-sabarval-.jpg)
ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. సబర్వాల్ వ్యాఖ్యలను మాజీ బ్యూరోక్రాట్, సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు బాలలత తీవ్రంగా ఖండించారు. తనతో సివిల్స్ పరీక్షకు రాయడానికి స్మిత సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని స్మితాకు సవాల్ విసిరారు. ఆమె గుర్తింపు కోసమే మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ మాటలు దురదృష్టకరమన్నారు. అసలు దివ్యంగులం బతకాలా? వద్దా? మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా? వద్దా? అంటూ ప్రశ్నించారు. పని ఉన్నోళ్లు పని చేస్తారని.. ట్వీట్ లు పెడుతూ ఉండరని విమర్శించారు. స్మితా సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ.. మెంటల్ గా ఫిట్ గా లేరన్నారు. స్మితా మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా? తెలంగాణ ప్రభుత్వ విధానమా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి:Smitha Sabharwal IAS: ఆ రిజర్వేషన్లపై దుమారం రేపిన స్మితా సబర్వాల్ కామెంట్స్.. నెట్టింట బిగ్ డిబేట్!
స్మితా తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ లో పరుగెత్తుతూ పని చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్మితా ట్వీట్ తాను దివ్యంగుల పట్ల వివక్షతను చూపుతోందన్నారు. ఐటీ యాక్ట్ కింద స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్లు పనిచేయవని.. కానీ ఆయనకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డికి కాళ్లు లేకపోయినా ఐఏఎస్ అధికారులే అయన్ని నడిపించారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులు అని స్మితాకు ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు.
సీఎం, సీఎస్ ఆలోచించి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. స్మితా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించాలన్నారు. స్మితపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలన్నారు. నిరసన ప్రజాస్వామ్యంలో హక్కు అని సీఎం అన్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం మాటలను స్ఫూర్తిగా తీసుకుని ట్యాంక్ బండ్ పై ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. స్మితా చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్ లు సైతం స్పందించాలని డిమాండ్ చేశారు.
స్మితా సబర్వాల్ కి ఏదైనా జరగరానిది జరిగి దివ్యంగురాలు అయితే ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. స్మితా జస్ట్ ఒక ఐఏఎస్ అధికారి మాత్రమేనన్నారు. స్మితా పర్సనల్ లైఫ్, స్మితా రీల్స్ గురించి తాను మాట్లాడనన్నారు. ఆమె రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి:TG Job Calendar: జూన్‌లో నోటిఫికేషన్లు, డిసెంబర్‌లోగా నియామకాలు.. తెలంగాణ జాబ్ క్యాలెండర్ లేటెస్ట్ అప్డేట్స్!