Jagan: కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తాం.. జగన్ సంచలన వ్యాఖ్యలు ఇప్పటికే మూడు నెలల సమయం గడిచి పోయిందని.. ఐదేళ్లు కూడా ఇట్టే గడిచిపోతుందని జగన్ ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని.. కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తామని వాఖ్యానించినట్లు సమాచారం. By Nikhil 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వైసీపీ అధినేత జగన్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ఈ రోజు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు నెలల కాలం గడిచిపోయింది.. ఐదేళ్లు కుడా ఇట్టే గడిచి పోతుందని అన్నట్లు తెలుస్తోంది. అందరూ ధైర్యంగా ఉండాలని.. తిరిగి మనం అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది కూడా చదవండి: Raghurama Raju: RRR సంచలనం.. నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి చెవిలో వార్నింగ్! 2029 ఎన్నికల్లో కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తామని కూడా అన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అవును సార్.. గత ఐదేళ్లు కూడా ఇట్టే గడిచిపోయాయాని అన్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా నవ్వినట్లు సమాచారం. ఢిల్లీలో నిర్వహించే దీక్షకు అందరూ హాజరవ్వాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి