Subrahmanyaa First Look : సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తండ్రి దర్శకత్వంలో తనయుడి సినిమా
డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన తమ్ముడి కొడుకు అద్వాయ్ హీరోగా 'సుబ్రమణ్య' అనే సినిమా రాబోతుంది. వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ కూడా సాయి కుమార్ తమ్ముడు పి.రవి శంకర్ కావడం విశేషం.