వరద బాధితుల కోసం రూ.కోటి అందించిన పవన్
విజయవాడ వరద బాధితుల సహాయార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల రూ.కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇందుకు సంబంధించిన చెక్కును ఈ రోజు సీఎం చంద్రబాబునాయుడిని కలిసి అందించారు పవన్.
విజయవాడ వరద బాధితుల సహాయార్థం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల రూ.కోటి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇందుకు సంబంధించిన చెక్కును ఈ రోజు సీఎం చంద్రబాబునాయుడిని కలిసి అందించారు పవన్.
నేడు వినాయక చవితి సందర్భంగా... గణేశుడిని ఈ శ్లోకంతో పూజించండి.. ''శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏక దంతముపాస్మహే || ఏక దంతముపాస్మహే ||''
ఖైరతాబాద్ మహా గణపతి మొదటి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. రేవంత్ వెంట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
విజయవాడ కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు.
వినాయకచవితి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు సైతం ఈ పూజల్లో పాల్గొన్నారు.
ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 70 అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ గణనాథుడికి తొలిపూజను అర్చకులు ప్రారంభించారు. సీఎం రేవంత్ మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
బంగారం లో 9 క్యారెట్లకు కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో 9 క్యారెట్ల బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. బంగారంలో రకాలేమిటి? 9 క్యారెట్ల బంగారం మంచిదేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 33 వివాదాస్పదం అయింది. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్స్ పై తీర్పు వచ్చింది. అసలు జీవో 33 వివాదం ఏమిటి? తీర్పు తరువాత ఏమి జరగవచ్చు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
రాజ్ తరుణ్, లావణ్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రాజ్ తరుణ్, మాల్వి ముంబైలో ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లిన లావణ్య ఇద్దర్నీ పట్టుకుంది. తనని మోసం చేసి మాల్వీ తో సహజీవనం చేస్తున్నాడు అంటూ లావణ్య ఆరోపణలు చేసింది.