Vijayawada Floods: ఆ తప్పుల వల్లే విజయవాడలో వరదలు.. కారణం వారే!
ఆక్రమణలు, బుడమేరు డైవర్షన్ పనులు నిలిచిపోవడమే విజయవాడలో వరదలకు కారణమని తెలుస్తోంది. ఇంకా కృష్ణానది ముఖ ద్వారంలో రాజకీయ నాయకులకు చెందిన అనేక నిర్మాణాలు ఉన్నాయి. అవి వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. ఈ నిర్మాణాలను తొలగించకపోవడం మరో కారణమన్న చర్చ ఉంది.