జమ్మూకశ్మీర్‌ను తరచూ భుతల స్వర్గదామంగా పిలుస్తారు. అలాగే అక్కడ అస్థిరత్వం కూడా ఉంటుంది. కానీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతంలో అనేక మార్పులు జరిగాయి. ప్రధాని మోదీ సారథ్యంలో.. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడం, అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం లాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక సంస్కరణలు వచ్చాయి. ఇవే జమ్మూ కశ్మీర్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కారణమయ్యాయి. దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్ గొప్ప సంస్కృతిని, చారిత్రక ప్రాముఖ్యతను చాటిచెప్పింది. అయినప్పటికీ ఘర్షణలు, ఉగ్రవాదం, అస్థిరతతో ఆ ప్రాంతం దెబ్బతింది.
Also Read: చెల్లి కోసం ఢిల్లీలో ఆటో ఎక్కిన కేటీఆర్.. వీడియో వైరల్!
ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం.. జమ్మూ కశ్మీర్‌కు భూతల స్వరంగా పిలవబడే పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసింది. అక్కడ మౌలిక సదుపాయలను మెరుగుపరచడం, పర్యాటర రంగాన్ని అభివృద్ధి చేయడంపై మోదీ సర్కార్ దృష్టి సారించింది. కొత్త రహదారులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే లింకులు ఇలా వీటన్నింటిని అభివృద్ధి చేయడం వల్ల టూరిస్టులు ఆ ప్రాంతంలో ఉన్న అందాలను, వారసత్వ సాంస్కృతికతను చూసేందుకు మార్గాలను మరింత సుగమం చేసింది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగిపోయింది. దీంతో ఆ ప్రాంతానికి ఆర్థికంగా నిధులు సమకూరుతున్నాయి. అలాగే అక్కడ నివసించే వేలాది మందికి జీవనోపాధి దోరుకుతోంది.
జమ్మూకశ్మీర్ అభివృద్ధికి, అక్కడ శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని మోదీ అనుసరించిన విధానం.. ఆర్టికల్ 370ని రద్దు చేయడం. ఈ నిర్ణయం వల్ల ఆ ప్రాంతంలో చారిత్రత్మక మార్పునకు దారితీసింది. చివరికి జమ్మూ కశ్మీర్ పూర్తిగా ఇండియాలో కలవడంతో.. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఆర్టికల్ 370 రద్దు విధానం ఎంతగానో దోహదపడింది. జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడు ప్రతీమూలన జాతీయ జెండా ఎగురుతుండటం అక్కడ భారత ఐక్యమం, సార్వభౌమధికారాన్ని సూచిస్తోంది. ఈ విధానం కేవలం అక్కడి ప్రజల్లో ఐక్యమత్య భావాన్నే కాదు.. భారత్ తమ భూభాగానికి, జాతీయ ఐక్యమత్యానికి కట్టుబడి ఉంటుందనే గట్టి సందేశాన్ని ప్రపంచానికి పంపించింది. జమ్మూకశ్మర్ ప్రజల జీవన విధానాలను మెరుగుపరిచేదుకు మోదీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.
Also Read: కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు!
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాజకీయ అస్థిరత నెలకొన్న తర్వాత కొన్నేళ్లకి అక్కడ ఈ ఎన్నికలు జరిగాయి. అలాగే ఓటింగ్ శాతం కూడా చాలావరకు పెరగడం.. ప్రజాస్వామ్య విధానంలో ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ మోదీ ప్రభుత్వం విజయవంతగా ఎన్నికలు నిర్వహించగలిగింది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న శాంతి, అభివృద్ధి వల్ల భవిష్యత్తులో అక్కడి ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరనుంది.