Russia : రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు (Passenger Train) తొమ్మిది కోచ్ లు పట్టాలు తప్పడంతో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారో తెలియడం లేదు. రైలు 511 ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా ఈశాన్య కోమిలోని వోర్కుటా.. నల్ల సముద్రపు ఓడరేవు నోవోరోసిస్క్ మధ్య సుమారు 5,000 కిలో మీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం (Train Accident) జరిగింది. సంఘటనా స్థలానికి అత్యవసర సేవలను పంపినట్లు అధికారులు టెలిగ్రామ్ (Telegram) ద్వారా తెలిపారు. ప్రయాణికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 14 కోచ్ లలో 232 మంది ప్రయాణికులు ఉన్నారని రైల్వే ఆపరేటర్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల (Heavy Rains) వల్ల రైలు బోగీలు పట్టాలు తప్పాయని రష్యా రైల్వే పేర్కొంది.
Also read: ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు..ట్విస్ట్‌లతో అదరగొట్టిన నాగ్ అశ్విన్