Calling Name Presentation: ట్రాయ్ (TRAI) మొబైల్ యూజర్లకు కీలక ఫీచర్ అందుబాటులోకి తేనుంది. ట్రూ కాలర్‌ను ఉపయోగించకుండానే మనకు ఫోన్ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. మన ఫోన్లో అవతలివాళ్ల ఫోన్ నంబర్ సేవ్ చేసి లేకపోయినా, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినా.. వారి పేర్లు మన మొబైల్ స్క్రీన్‌పై కనిపించేలా ‘పేరు వెల్లడి సేవ’ (నేమ్ ప్రజెంటేషన్ సర్వీస్)ను అందుబాటులోకి తేనుంది. ఈ నెల 15వ తేదీన ఈ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించనుంది.
సిమ్ కార్డు కొన్నప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కాలర్ల పేర్లు ఫోన్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ఎవరు చేస్తున్నారో గుర్తించడానికి ప్రస్తుతం చాలా మంది ‘ట్రూ కాలర్’ యాప్‌ను వాడుతున్నారు. అయితే, దీని వల్ల సమాచార భద్రతపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలోనే ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే షమీ లాంటి ఫోన్ లలో ఇలాంటి ఫీచర్ ఒకటి అందుబాటులో ఉంది.