TRAI: అలాంటి కాల్స్ చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్..ట్రాయ్ కొత్త రూల్స్

ఈ మధ్య కాలంలో స్పామ్ కాల్స్, ఫోన్లలో సైబర్ క్రైమ్‌లు బాగా ఎక్కువ అయిపోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో అక్రమార్కుల ఆట కట్ అని చెబుతోంది. అవేంటో కింద చదివేయండి.

TRAI: 2.75 లక్షల నంబర్లు కట్..స్పామ్ కాల్స్ మీద చర్యలు
New Update

TRAI New Rule: వినియోగదారుల సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ నడుం బిగించింది. దీని కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. వీటి ద్వారా స్పామ్ కాలర్స్, సైబర్ క్రైమ్ ను కట్టడి చేయనుంది. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్‌కు ఆదేశాలు కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది.

కొత్త నిబంధనలు ప్రకారం.. ప్రైవేట్ మొబైల్ లేదా అన్నోన్ నెంబర్ నుంచి టెలీ మార్కెటింగ్ కాల్ చేస్తే టెలికాం ప్రొవైడర్ ఆ నంబర్‌‌ను రెండు ఏళ్ళు బ్లాక్ చేయాలి. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ డేటా ప్రకారం మూడు నెలల్లో పది వేల కంటే ఎక్కువ స్పామ్ కాల్స్ నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ టెలికాం సర్వీస్ వీటి మీద యాక్షన్ తీసుకోలేదు. వినియోగదారులు కంప్లైంట్స్ ఇస్తున్నా..పెద్దగా మీ చేయలేదు. దీంతో డైరెక్ట్‌గా ట్రాయ్ రంగంలోకి దిగింది. కొత్త నిబంధన ప్రకారం స్పామ్ కాల్స్‌కు టెలికాం ఆపరేటర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ప్రైవేట్ నెంబర్ నుంచి టెలీ మార్కెటింగ్ కాల్స్ వచ్చినట్టు వినియోగదారులు ఫిర్యాదు చేస్తే వెంటనే టెలికాం ఆపరేటర్ యాక్షన్ తీసుకోవాలి. దీని మీద వేంటనే విచారణ జరిపి ఏ నంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ సిమ్‌ను రెండేళ్ళ పాటూ బ్లాక్ చేయాలి. దీంతో ఇక మీట తమ వ్యక్తిగత ఫోన్ నుంచి మార్కెటింగ్ కాల్స్ చేస్తే ఇబ్బందులు తప్పవు. ఈ రూల్ కారణంగా స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ తగ్గుతాయని ట్రాయ్ భావిస్తోంది.

Also Read: Telangana: సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

#new-rule #telecom #spam-calls #trai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి