Numaish Exhibition: నాంపల్లిలో నుమాయిష్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.!

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జనవరి 1వ తేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్‌ కొనసాగుతుంది.

Numaish Exhibition: నాంపల్లిలో నుమాయిష్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.!
New Update

Numaish Exhibition: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) , సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం లాగే జనవరి 1వ తేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు 46 రోజుల పాటు కొనసాగుతుంది. దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, ఫుడ్‌ కోర్టులు, వివిధ పారిశ్రామికవేత్తల ఉత్పత్తి అమ్మకాలు చేపట్టేందుకు స్టాళ్లను ఏర్పాటు చేశారు.

Also Read: న్యూ ఇయర్ వేళ ఓల్డ్ సిటీలో మందుబాబు బిల్డప్.. పోలీసును చెంపపై కొట్టి..!

నుమాయిష్‌కు (Numaish Exhibition) వచ్చే సందర్శ కులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ నుమాయిష్‌ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు వేళలను పొడిగించారు. 83వ ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఉండడంతో ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాంపల్లి (Nampally) ఎగ్జిబిషన్‌ మైదానం పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ట్రాఫిక్‌ మళ్లింపు:
సిద్దంబర్‌బజార్‌ వైపు నుంచి నాంపల్లి వైపునకు వెళ్లే ఆర్టీసీ జిల్లా బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, ఇతర భారీ వాహనాలను మొహింజామార్కెట్‌ వద్ద అబిడ్స్‌ వైపు మళ్లిస్తారు.
బషీర్‌బాగ్‌, కంట్రోల్‌ రూం వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద బీజేఆర్‌ విగ్రహం, అబిడ్స్‌ వైపు మళ్లిస్తారు.
బేగంబజార్‌, ఛత్రి నుంచి మలాకుంట వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్‌ వద్ద దారుసలాం, ఏక్‌మినార్‌ వైపు మళ్లిస్తారు.
దారుసలాం నుంచి అఫ్జల్‌గంజ్‌ వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజ్‌ వైపు మళ్లిస్తారు.
మూసాబౌలి, బహుదూర్‌పురా వైపు నుంచి నాంపల్లికి వెళ్లే వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ రూట్‌లో మళ్లిస్తారు.

#hyderabad #numaish-exhibition #traffic-restrictions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe