Yadadri: యాదాద్రి భక్తులకు బిగ్ అలర్ట్.. వారికి నో ఎంట్రీ!

యాదాద్రి ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆర్జిత పూజలో పాల్గొనే భక్తులు ఇకనుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధించింది. ఉచిత దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ నియమం వర్తించదు.

Yadadri: యాదాద్రి భక్తులకు బిగ్ అలర్ట్.. వారికి నో ఎంట్రీ!
New Update

Yadadri Dress Code: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తిరుపతిగా పిలువబడే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత పూజలో పాల్గొనే భక్తులు ఇకనుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధించింది. ఈ మేరకు జూన్ 1నుంచి ఆర్జిత సేవలు వినియోగించుకునే భక్తులంతా సంప్రదాయ దుస్తులే ధరించి రావాలని సూచించారు. ఇక ఉచిత దర్శనం కోసం క్యూలైన్​లో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదని స్పష్టం చేశారు.

Also Read: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 8 నెలల జీతం బోనస్!

అలాగే ఆర్థిక పూజల్లో పాల్గొనే భక్తులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని ఆలయ ఈవో చెప్పారు. ఇదిలావుంటే.. మే 20 నుంచి 22 వరకూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేశామని, 20న ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనం, లక్ష కుంకుమార్చన పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అలాగే దేవస్థానం పరిధిలో ప్లాస్టిక్‌ నిషేధించారు. ప్లాస్టిక్ కవర్స్, వాటర్‌ బాటిల్స్‌, ఇతరత్ర వస్తువులు అనుమతించమని తెలిపారు.

#telangana #yadadri-temple #dress-code
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe