Revanth Reddy: డిసెంబర్ లో అద్భుతం.. ఆ రోజున రాష్ట్రానికి విముక్తి: రేవంత్ రెడ్డి

ఈ రోజు తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందన్నారు. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోందని వాఖ్యానించారు రేవంత్.

Revanth Reddy:కావాలనే నాగార్జున సాగర్ వివాదం సృష్టించారు-రేవంత్ రెడ్డి
New Update

Revanth Reddy: ఈ రోజు తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Telangana Assembly Elections Schedule) విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందన్నారు. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడ కాబోతోందన్నారు. రాబోయే విజయదశమిని ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో లక్ష కోట్లు, పదివేల ఎకరాల భూములను కేసీఆర్ (KCR) కుటుంబం ఆక్రమించుకుందని ఆరోపించారు. ఆఖరికి అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: చివరికి తెలంగాణ ఎలక్షన్స్.. బీజేపీకి అడ్వాంటేజ్?

కాంగ్రెస్ (Congress) ఆరు గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు. కేసీఆర్ (KCR) విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందన్నారు. ఇక ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదని సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారన్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ లో అద్భుతం జరగబోతుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతీ మహిళకు నెలకు రూ.2500 రాబోతున్నాయన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించబోతున్నామని వివరించారు.

ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల సాయం అందజేయబోతున్నామన్నారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నాట్లు చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలలో వేటిపైనైనా చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) సవాల్ విసిరారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 2018లోనూ బీజేపీ (BJP) ఇదే పని చేసిందని ఆరోపించారు.

#congress #revanth-reddy #telangana-elections-2023 #brs-party #revanth-reddy-comments-on-kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe