మహిళల ఉచిత బస్ ప్రయాణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. '' కేటీఆర్ మహిళల ఫ్రీ బస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో వారిని బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్‌లు చేయండి అంటూ కించపరుస్తూ అవహేళనగా మాట్లాడారు.
Also Read: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా నియామకం
తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలి. నిరసన కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని.. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలని'' మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
మరోవైపు కేటీఆర్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించింది. మహిళలపై అనుచితంగా కామెంట్స్ చేసినందుకు దీనిని సూ మోటోగా స్వీకరించినట్లు వెల్లడించింది. పోస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు బాధ కలిగించాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చట్టం ప్రకారం.. ఈ అంశంపై సూ మోటో విచారణ చేపట్టిందని స్పష్టం చేసింది.
Also Read: హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడు రోజులు వానలే !