Alluri District : అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పోచమ్మ గండి వద్ద పాపికొండల పర్యాటక బోట్లను టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) పరిశీలించారు. పాపికొండలు వెళ్లి వచ్చిన పర్యాటకులతో బోట్ లో సమస్యలు అడిగి తెలుకున్నారు. బోట్ భద్రత దృష్ట్యా అధికారులతో కలిసి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గండి పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, ఆశీర్వచనం తీసుకున్నారు మంత్రి కందుల దుర్గేష్.
Also Read: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు పలకడం హాస్యాస్పదం: పురంధేశ్వరి
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ (Andhra Pradesh) లో టూరిజం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నదిపై పాపికొండలు పర్యటన చేసే వాళ్లకు.. పర్యాటకుల అవసరం నిమిత్తం అన్ని సేవలను అందుబాటులో ఉంచుతామన్నారు. బోట్ పాయింట్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు..!
పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ను సందర్చించేసలా చర్యలు తీసుకుంటామన్నారు. రంపచోడవరం పర్యాటక ప్రాంతాల్లో గుడిసేను, పాపికొండల విహారయత్రని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పర్యాటకుల రద్దీ పెరిగితే బోట్లను పెంచుతామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పుష్ప (Pushpa) సినిమా షూటింగ్ స్పాట్ లను పర్యాటకులు అక్రమించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.