Heavy Rains: దేవభూమిలో పొంగి పోర్లుతున్న నదులు..100 రహదారులు మూసివేత!

దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ ను అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి ప్రధాన నదులన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. మరో వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఉత్తరాఖండ్‌ వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేశారు.

New Update
Heavy Rains: దేవభూమిలో పొంగి పోర్లుతున్న నదులు..100 రహదారులు మూసివేత!

Heavy rains: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ ను అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి ప్రధాన నదులన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. మరో వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఉత్తరాఖండ్‌ వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేశారు. చంపావత్‌, అల్మోరా, పిథోర్‌గఢ్‌, ఉధమ్‌సింగ్‌ నగర్‌ తో పాటు కుమాన్‌ వంటి ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే హరిద్వార్‌ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల గంగా, అలకనంద, భాగీరథీ , శారద, మందాకిని కోసి నదుల్లో నీరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను అనుకొని ఉన్న 100 రహదారులను అధికారులు మూసివేశారు.

ఈ క్రమంలో అలకనంద నది ఉప్పొంగడంతో రుద్ర ప్రయాగ్‌ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహాం నీట మునిగింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also read: తెలంగాణలో రాగల ఐదు రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

Advertisment
తాజా కథనాలు