Hyderabad : రేపు హనుమాన్ జయంతి.. శోభాయాత్ర సందర్భంగా ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అంటే..

హనుమాన్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించినట్లే.. ఈసారి కూడా శోభాయాత్రను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. కొన్ని రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

New Update
Hyderabad : రేపు హనుమాన్ జయంతి.. శోభాయాత్ర సందర్భంగా  ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అంటే..

Telangana : లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) లు వస్తున్న సమయంలో.. ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉన్న సందర్భం.. ఇలాంటి సమయంలో ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) సందర్భంగా.. హైదరాబాద్‌(Hyderabad) లో శోభాయాత్ర జరగబోతోంది. ఈ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, పూర్తి ప్రశాంత వాతావరణంలో ఇది జరిగేలా హైదరాబాద్ పోలీసులు.. పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే.. కొన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ఉదయం 11.30కి శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమవుతుంది. అది అది సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్‌(Hanuman Mandir) కి వెళ్తుంది. ఈ శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం, పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఆంధ్రబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామకోటి క్రాస్ రోడ్స్, కాచీగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ YMCA, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, RTC క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైశ్రాయ్ హోటల్ వెనకవైపు, ప్రాగా టూల్స్, కవాడీగూడ, CGO టవర్స్, బన్సీలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాలపేట్ పీఎస్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, CTO జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపెరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్, తాడ్ బండ్ హనుమాన్ ఆలయం దగ్గర లెఫ్ట్ టర్న్ దిశగా ఈ శోభాయాత్ర సాగుతుంది. ఇది మొత్తం 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ యాత్ర రాత్రి 8 గంటలకు ముగుస్తుంది.

మరో శోభాయాత్ర రాచకొండ కమిషనరేట్ పరిధిలో కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి మొదలై.. చంపాపేట దగ్గర హైదరాబాద్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇది చంపాపేట క్రాస్ రోడ్, IS సదన్, ధోబీఘాట్, సైదాబాద్ Y జంక్షన్, (DCP సౌత్ ఈస్ట్ జోన్ ఆఫీస్), సైదాబాద్ కాలనీ రోడ్, శంకేశ్వర్ బజార్ గుండా సాగుతూ.. రాచకొండలోకి ఎంటర్ అవుతుంది. ఇది సరూర్ నగర్ లిమిట్స్ దగ్గర తిరిగి హైదరాబాద్ లోకి ఎంటరై.. రాజీవ్ గాంధీ స్టాట్యూ, దిల్‌సుఖ్ నగర్ గుండా సాగుతూ.. మూసారంబాగ్ జంక్షన్, మలక్ పేట్, నల్గొండ క్రాస్ రోడ్, అంజంపురా రోటరీ, చందేర్ ఘాట్ క్రాస్ రోడ్ గుండా సాగుతూ.. DM అండ్ HS ఉమెన్స్ జంక్షన్ దగ్గర.. శోభాయాత్రతో కలుస్తుంది. ఇది మొత్తం 10.8 కిలోమీటర్లు ఉంటుంది.

Also Read : సూపర్ స్టార్ ‘కూలీ’.. టైటిల్ టీజర్ అదిరిపోయింది..!

Advertisment
Advertisment
తాజా కథనాలు