Big Breaking: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు గాయాలు..!! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖానికి గాయాలయ్యాయన్న వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఎస్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ ప్రాథమిక చికిత్స పొందుతున్నట్లు సమాచారం . దీంతో ఆయన నటించాల్సిన గేమ్ చేంజర్ సినిమా కు బ్రేక్ పడింది. By Jyoshna Sappogula 25 Sep 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Ram Charan Injured : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖానికి గాయాలయ్యాయన్న వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఎస్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ (Game Changer) షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి అనుకూలంగా లేకపోవడంతో, పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో ఆయన నటించాల్సిన గేమ్ చేంజర్ సినిమా కు బ్రేక్ పడింది. తదుపరి చిత్రీకరణ కొన్ని రోజుల పాటు వాయిదా పడినట్టు సమాచారం. గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) నటిస్తోన్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అన్న వార్త గతంలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే శంకర్(Director Shankar) రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇచ్చిన టైంలో గేమ్ చేంజర్ షూట్‌ను చకచకా చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అనుకున్న షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. రామ్ చరణ్ మొహానికి చిన్న పాటి గాయం అవ్వడంతో ఈ షెడ్యూల్ కాన్సిల్ అయినట్టుగా సమాచారం. సెప్టెంబర్‌లో చివరి వారంలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్‌కు ఇలా అవ్వడంతో షూట్‌ను క్యాన్సిల్ చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆర్టిస్టుల డేట్లు అందుబాటులో లేకపోవడంతో షూట్ క్యాన్సిల్ చేస్తున్నామని టీం ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, అసలు విషయం మాత్రం రామ్ చరణ్‌కు గాయం అయినందుకే షెడ్యూల్ కాన్సిల్ చేసారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు, గేమ్ చేంజర్ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నాడట. ఈ మూవీ పూర్తి చేసిన తరువాత ఆ వెంటనే బుచ్చిబాబు ప్రాజెక్ట్‌లో జాయిన్ కావాలని అనుకున్నారట. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులతో రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇలా మధ్య మధ్యలో ఏదో ఒక కారణంతో షూట్ క్యాన్సిల్ అవ్వడం, రామ్ చరణ్‌కు ఇలా అవుతుండటంతో ఫాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు. కానీ,రామ్ చరణ్ గాయంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అక్టోబర్ మొదటి వారంలో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి స్టంట్ కొరియోగ్రాఫర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుంది. గాయం నుంచి కోలుకున్న వెంటనే రామ్ చరణ్ తిరిగి చిత్రీకరణలో పాల్గొనన్నట్లు తెలుస్తోంది. Also Read: అమ్మ లేని ఇల్లు బోసిపోయింది..హీరో కార్తీ ఎమోషనల్ పోస్ట్! #tollywood #game-changer #mega-family #ramcharan #mega-power-star #ramcharan-injured #ram-charan-injured మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి