/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-31-3.jpg)
Manamey Release Date: టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand), యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటిస్తున్న తాజా చిత్రం మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంది.
అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. జూన్ 7న మనమే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఒక డిఫెరెంట్ లవ్ స్టోరీ ను చూపించబోతున్నట్లు తెలిపారు మేకర్స్. కామెడీ, ఎమోషన్స్, లవ్ వంటి భావోద్వేగాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకోనుంది.
#Manamey will be yours from 𝐉𝐔𝐍𝐄 𝟕𝐭𝐡 📣✨
The 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the Season is all set to paint your hearts & screens ❤️🔥
In Cinemas #ManameyOnJune7th 🥳 @SriramAdittya @IamKrithiShetty @HeshamAWMusic @vishwaprasadtg @peoplemediafcy… pic.twitter.com/pHbdB4MnE8
— Sharwanand (@ImSharwanand) May 24, 2024
సరికొత్త ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
Vishwambhara: విశ్వంభర అప్డేట్.. మెగాస్టార్ సరసన నాగార్జున హీరోయిన్ - Rtvlive.com