/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-26T152847.764-jpg.webp)
Ram Charan- Sukumar Combo Again For RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'గేమ్ చేంజర్' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న RC16 షెడ్యూల్ భాగం అవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది.
రామ్ చరణ్ - సుకుమార్ RC17
#TFNExclusive: Mega Powerstar @AlwaysRamCharan along with his beautiful wife @upasanakonidela and little princess #KlinKaaraKonidela seen 📸 at the airport as they jet off from HYD ahead of his birthday! 😍🤍#RamCharan #GameChanger #RC16 #RC17 #TeluguFilmNagar pic.twitter.com/UplczyE3si
— Telugu FilmNagar (@telugufilmnagar) March 26, 2024
ఇది ఇలా ఉంటే.. స్టార్ డైరెక్టర్ సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో సారి చేతులు కలుపుతున్నారు. తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. RC17 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. గతంలో 'రంగస్థలం' మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబో మరో సారి రిపీట్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. 'రంగ స్థలం' మూవీని నిర్మించిన మైత్రి మేకర్సే ఈ RC17 కూడా నిర్మించడం విశేషం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యాక్షన్, రొమాంటిక్ కథలతో ప్రేక్షకులను మెప్పించిన సుకుమార్ ఈ సినిమాలో సరి కొత్త జానర్ ఎంచుకున్నట్లు సమాచారం.
Mighty forces reunite for an earth-shattering magnum opus 🔥❤🔥
Global Star @AlwaysRamCharan X The Maverick Director @aryasukku X Rockstar @ThisisDSP X @MythriOfficial X @SukumarWritings = #Raring2Conquer 🐎#RC17 is all set to add new colours to the Indian Cinema ❤🔥 pic.twitter.com/ISRZaumDng
— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024
Also Read: Brahmanandam: హస్య బ్రహ్మా వరం.. రూ.2లక్షల సాయం.. నువ్వు నిజంగా దేవుడివి బాసు!