/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T134021.829.jpg)
Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఏప్రిల్ 13న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే తాజాగా మనోజ్ తన ముద్దుల కూతురికి నామకరణం చేశారు. మనోజ్ తన కూతురికి 'దేవసేన శోభ MM' అని పేరు పెట్టారు. ఈ పేరును పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని కూడా తెలిపారు. "పరమేశ్వరుడి భుక్తులమైన మేము ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి సతీమణి పేరు నుంచి 'దేవసేన', మా అత్తగారు శ్రీమతి శోభా నాగిరెడ్డి పేరు నుంచి శోభ కలిసి వచ్చేలా మా పాపకు 'దేవసేన శోభ' అని నామకరణం చేశామని తెలిపారు." ఈ నామకరణ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మనోజ్.
With all Your’s & Lord Shiva’s blessings, we named our Daughter 🙏🏼❤️ #DevasenaShobhaMM pic.twitter.com/n6dvJeDoVR
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 8, 2024