Tollywood Drugs Case: ఈడీ ముందుకు నవదీప్‌!

మాదాపూర్‌ మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ మంగళవారం ఈడీ ముందు హాజరు కానున్నారు. కేసుకు సంబంధించి ఎన్‌ ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆయనను విచారించనున్నారు.

Tollywood Drugs Case: ఈడీ ముందుకు నవదీప్‌!
New Update

Tollywood Drugs Case: మాదాపూర్‌ మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ (Navdeep) మంగళవారం ఈడీ (ED) ముందు హాజరు అయ్యారు. కేసుకు సంబంధించి ఎన్‌ ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆయనను విచారించనున్నారు.

ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతా లావాదేవీలకు, మత్తు పదార్థాల వినియోగదారులతో ఉన్న సంబంధాల గురించి నవదీప్‌ ను ప్రశ్నించనున్నారు.

ఈ మేరకు ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదుపులో ఉన్న వారి నుంచి పోలీసులు మరింత సమాచారం రాబడుతున్నారు. విచారణలో నిందితులు చెబుతున్న విషయాలు...వారు ఇస్తున్న వ్యక్తుల వివరాల ప్రకారం మరికొందరిని కూడా అదుపులోనికి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిందితుల కాల్‌ లిస్ట్‌ ని పరిశీలిస్తే అందులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారందరి మీద కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే నవదీప్‌ ను కూడా ఇంతకు మందు నార్కోటిక్‌ విభాగానికి చెందిన పోలీసులు విచారించారు.

అయితే ఈ కేసులోకి ఈడీ కూడా ఎంటర్‌ అవ్వడంతో మరింత ఉత్కంఠ కలిగిస్తుంది. ఈడీ ముందు మంగళవారం హాజరు కావాలంటూ నవదీప్‌ కు అక్టోబర్‌ 7 న నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ఈడీ విచారణ చేపట్టనుంది.

Also Read: Israel-Hamas War: యుద్ధానికి వెళ్తున్న భర్త..తిరిగి వస్తాడో రాడో అని..!!

#ed #navadeep #drugs-case #tollywood-drugs-case-navdeep #tollywood-drugs-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe