Drugs case: నవదీప్ కోసం వేట! నెక్ట్స్ ఏం జరగబోతోంది?
నవదీప్ కోసం అధికారుల వెతుకులాట కొనసాగుతోంది. హైదరాబాద్లోని అతని నివాసంపై తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో దాడులు చేసింది. పోలీసుల సోదాల్లో నవదీప్ ఇంట్లో లేకపోయినా.. ఏజెన్సీ వచ్చిన విషయం తెలుసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న నవదీప్ అరెస్ట్ నుంచి ఉపశమనం పొందాలని హైకోర్టును ఆశ్రయించగా, ఇవాళ్టి వరకు అనుమతి లభించింది. హైకోర్టు రిలీఫ్ గడువు ముగియడంతో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు నిర్వహించింది. దీంతో నవదీప్ మరోసారి డ్రగ్స్ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.