Modern Masters : ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. రాజమౌళి డాక్యుమెంటరీ నెక్స్ట్ లెవెల్..!

ఎస్‌.ఎస్ రాజమౌళి సినీ జీవితం పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందించింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, జేమ్స్ కామెరున్ వంటి స్టార్స్ రాజమౌళి వర్క్, ఫిల్మ్ మేకర్ గా ఆయన గొప్పతనం గురించి మాట్లాడడం చూపించారు.

New Update
Modern Masters : ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. రాజమౌళి డాక్యుమెంటరీ నెక్స్ట్ లెవెల్..!

S.S Rajamouli : భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి. జక్కన్న చెక్కిన బాహుబలి, RRR చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. RRR సినిమాతో ఆస్కార్ గెలుపొందిన మొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించాడు రాజమౌళి.

జక్కన్న డాక్యుమెంటరీ ట్రైలర్

సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన రాజమౌళి సినీ జీవితం పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. 'మోడ్రన్ మాస్టర్స్' అనే పేరుతో దీన్ని రూపొందించారు. అయితే తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ లో స్తూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు జక్కన్న సినీ ప్రయాణాన్ని చూపించారు. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరున్, కరణ్ జోహార్ వంటి స్టార్స్ ఫిల్మ్ మేకర్ గా గొప్పతనం, ఆయన వర్క్, సినిమా పట్ల ఆయన డెడికేషన్ గురించి మాట్లాడిన మాటలతో ట్రైలర్ కట్ చేశారు.

Also Read : కావ్య‌కు తన ప్రేమను చెప్పేసిన రాజ్.. అప్పుతో కళ్యాణ్ పెళ్లి..! రాజ్ షాకింగ్ నిర్ణయం



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు