Bangalore Rave party: బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిపారు. బర్త్ డే వేడుకల పేరుతో హైదరాబాద్ యువకులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సెలబ్రిటీలు, బడా బాబులు, మోడల్స్, టెకీలు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రేవ్ పార్టీలో ఓ తెలుగు హీరో ఉన్నారని వార్త వైరల్ అవుతోంది. అయితే, ఆ హీరో పేరు మాత్రం బయటికి రావడం లేదు.
Also Read: రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణం ఇదే.. సిట్ సంచలన నివేదిక..!
పార్టీ ఏర్పాటు చేసిన హైదరాబాద్‌కు చెందిన వాసు ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. కాన్‌కార్డ్ ఓనర్ గోపాల్‌రెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌గా గుర్తించారు. ఆ పార్టీలో నటి హేమ ఉన్నట్టు కన్నడ మీడియా ప్రచారం చేయగా..ఆమె ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్టిక్కర్ ఉన్న కారును గుర్తించారు. అయితే, స్టిక్కర్ ఉన్న కారు తనది కాదంటున్నారు కాకాణి.
Also Read: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.!
పక్కా సమాచారంతో రేవ్ పార్టీపై నార్కొటిక్స్ బృందం దాడులు నిర్వహించారు. పార్టీలో MDMA, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో ఆంధ్ర, బెంగళూరుకు చెందిన 100మంది పాల్గొన్నారు. పార్టీ ప్రాంతంలో మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ఆడి కారు ఇలా 15కు పైగా లగ్జరీ కార్లు గుర్తించారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రేవ్ పార్టీ జరిపారు. ఒక్కరోజు పార్టీ ఖర్చు రూ.30 నుంచి 50లక్షల వరకు అయినట్లు తెలుస్తోంది.