HBD Allu Arjun: బన్నీకి డేవిడ్ వార్నర్ స్పెషల్ విషేష్.. ఇంకా ఎవరెవరు ట్వీట్ చేశారంటే..!

నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిరోజు. ఈ సందర్భంగా ఇటు సినీ ప్రముఖుల నుంచి ఫ్యాన్స్ వరకు అంతా బన్నీకి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, వెంకటేష్ తో పాటు పలువురు సెలెబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

HBD Allu Arjun: బన్నీకి  డేవిడ్ వార్నర్ స్పెషల్ విషేష్.. ఇంకా ఎవరెవరు ట్వీట్ చేశారంటే..!
New Update

HBD Allu Arjun:  అల్లు అర్జున్ అంటే పేరు అనుకుంటివా.. అభిమానుల గుండెల్లో ఫైరు అనే రేంజ్ కు ఎదిగిపోయారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ స్టైలిష్ స్టార్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం, ఆ పాత్రకు న్యాయం చేయడం అతని నైజం. 20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బన్నీ.. పుష్ప’ సినిమాతో తగ్గేదేలే అంటూ భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.

అల్లు అర్జున్ పుట్టినరోజు

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మొట్ట మొదటి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. నేటితో బన్నీ 42 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక తమ అభిమాన నటుడి పుట్టినరోజు కావడంతో అభిమానుల హంగామా మాములుగా లేదు. సోషల్ మీడియా అంతా బన్నీ బర్త్ డే విషెష్ తో మారుమోగుతోంది. అల్లు అర్జున్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు ఫ్యాన్స్.

అల్లు అర్జున్ బర్త్ డే విషెష్

ఈ సందర్భంగా సినీ ప్రముఖులు నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ బన్నీకి విషెస్ తెలియజేస్తున్నారు. హీరో వెంకటేష్, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, నవదీప్, సుశాంత్, రకుల్, రష్మిక, మంచు లక్ష్మి, దర్శకుడు ప్రశాంత్ వర్మ, థమన్ , డిఎస్పీ ఇలా పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీస్ తమ స్పెషల్ స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

బన్నీకి డేవిడ్ వార్నర్ విషెష్

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బన్నీకి స్పెషల్ విషెష్ తెలియజేశారు. తన ఇన్స్టాగ్రామ్ పుష్ప2 టీజర్ ను షేర్ చేస్తూ విషెష్ తెలియజేశారు. దీనికి అల్లు అర్జున్ థ్యాంక్యూ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చారు.

publive-image

Also Read: Nithya Menon: గుండెజారి గల్లంతయ్యిందే.. హ్యాపీ బర్త్ డే కర్లీ బ్యూటీ.. ‘డియర్ ఎక్సెస్’ తో వచ్చేస్తున్న నిత్యా..!

#hbd-allu-arjun
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe