OTT : ఓటీటీ లోకి వచ్చేసిన విశ్వక్ సేన్ గామి చిత్రం!

ఇప్పటి యంగ్ హీరోలలో విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో విశ్వక్ సేన్ ఒకడు. అయితే లేటేస్ట్ గా వచ్చిన విశ్వక్ గామి చిత్రం ఓటీటీ లోకి వచ్చేసింది.ఈ సినిమా  జీ5లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

OTT : ఓటీటీ లోకి వచ్చేసిన విశ్వక్ సేన్ గామి చిత్రం!
New Update

Gaami : టాలీవుడ్(Tollywood) కుర్ర హీరో విశ్వక్‌సేన్(Vishwak Sen) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ గామి. చాందిని చౌదరి(Chandini Chowdary) మరో ముఖ్యపాత్రలో నటించింది. ఈ సినిమాతో విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ఇప్పటికే థియేట్రికల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీ(OTT) లో విడుదలకు రెడీ అవుతోంది.

యువ నటుడు విశ్వక్‌ సేన్‌(Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో  నటిస్తూ విశ్వక్  అదరగొడుతున్నారు.  అందులో భాగంగా రీసెంట్ గా ఆయన హీరోగా వచ్చిన  గామి  సినిమా కు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రం ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో.. తాాజాగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. ఈ సినిమా  జీ5లో ఈరోజు నుంచి అంటే ఏప్రిల్ 12నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో ఈ సినిమాను థియేటర్స్‌లోను చూడని ప్రేక్షకులు.. తమ టీవీలో, ఫోన్స్‌లో చూడోచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటీ రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో..

ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించాడు. విద్యాధర్‌ కాగిత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక విశ్వక్ సేన్ నటిస్తోన్న మరో మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari). సితార నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా రఫ్ అండ్ సీరియస్ పొలిటికల్ టచ్‌తో సాగనుందని తెలుస్తోంది. విష్వక్ సేన్ ఇలాంటి  పీరియాడిక్ సినిమా చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

ఇక ప్రచార చిత్రాలను బట్టి చూస్తే.. గోదావరి జిలాల్లో జరిగే మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. ఈ సినిమాను కృష్ణ చైతన్య కథ, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు. నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి కీలకపాత్రలో కనిపించనుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు.ఇక ఆ మధ్య విశ్వక్ సేన్ తన కెరీర్‌లో 10వ ప్రాజెక్ట్‌ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. దీనిని దర్శకుడు రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేయనున్నాడు. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్‌గా చేస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

#ott #gaami #vishwak-sen
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe