శ్రీలీల (Sreeleela) ...గత ఏడాది కాలం ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..ప్రస్తుతం నెలకో సినిమాని విడుదల చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
గుంటూరు కారం(Gunturu karam) సినిమా విడుదలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అందులో మహేష్ (Mahesh Babu) పక్కన ఆడిపాడింది శ్రీలీల. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య బాబు కూతురుగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. రవితేజ, రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్ ఇలా అందరితో జత కట్టింది.
తన చేతిలో ఇంకా పది సినిమాలు ఉండగా అందులో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకటి. తాజాగా శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది. అందులో సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. ప్రస్తుతం శ్రీలీల అటు కన్నడ కానీ ఇటు తెలుగు కానీ మొత్తం పది సినిమాల్లో యాక్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
కన్నడ చిత్రం కిస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. తెలుగులో ధమాకా సినిమా తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని ఆమె వివరించారు. ప్రస్తుతం ఈ ఏడాది అంతా ఫుల్ బిజీ బటర్ ఫ్లైని అంటూ చెప్పుకొచ్చింది.ఇలాంటి పాత్రే కావాలని నేనేమి డిమాండ్ చేయను..కథలో పాత్ర ఎలా ఉంటే అలా చేయడానికి నేను రెడీ అంటూ చెప్పుకొచ్చింది.
తీసుకున్న పాత్రకు న్యాయం చేయగలిగానా..లేదా అనే ఒక్క విషయం మాత్రమే నేను ఆలోచించాలి. పని చేసుకుంటూ ముందుకు సాగడమే నా చేతిలో ఉంటుంది. దాని ఫలితం కచ్చితంగా ప్రేక్షకుల చేతిలో ఉంటుందని ఆమె వివరించింది. దీనికి అంతటికి కారణం తన తల్లి అంటూ చెప్పుకొచ్చింది.
మా అమ్మ లేకుండా నాకు ఏ పని సవ్యంగా సాగదు. నా వెన్నంటి ఉండి ఎప్పుడూ ప్రోత్సాహించేది మా అమ్మ ఒక్కటే అని తెలిపింది. కేవలం పర్సనల్ లైఫ్ లోనే కాదు..స్క్రిప్ట్ ఎంపిక, కాల్‌షీట్స్ సర్దుబాట్లు లాంటి వృత్తిపరమైన వ్యవహారాల్లోనూ ఆమె నా వెనుకే ఉంది. ఎన్ని దేశాలు తిరిగినా మా అమ్మ చేతి వంట ఇచ్చిన రుచి ఎక్కడ లేదు అని తెలిపింది.
ఈ క్రమంలోనే నాకు కాబోయే వాడిలో ఈ మూడు లక్షణాలు ఉండాలంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ముందుగా నన్ను ఇష్టంగా భరించాలి. రెండోది.. చక్కని హాస్య చతురత కలిగి ఉండాలి. మూడోది, ముఖ్యమైంది ఫ్యామిలీ మ్యాన్ అయి తీరాలి అంటూ తెలిపింది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ లక్షణాలు ఉన్న కుర్రాళ్ల ప్రొఫైల్స్ శ్రీలీల ఇంటికి క్యూ కట్టేయండి.
Also read: అది కఠిన నిర్ణయమే..కానీ ఆలస్యం చేసుంటే నష్టపోయే వాళ్లం: సుందర్ పిచాయ్!