/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-27T173433.188-jpg.webp)
Samantha Watch Costs 70 Lakhs: నటి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచు లేటెస్ట్ ఫ్యాషన్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది సామ్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన మరో లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట వైరలవుతోంది. ఆకర్షణీయమైన తెల్లటి లక్కర్డ్ గూచీ జాకెట్, మినీ స్కర్ట్‌లో సమంత లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. భారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆకట్టుకుంటున్న ఈ దుస్తువులు ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీకి చెందినవి. ఈ ఫొటోల్లో సామ్ డైమండ్ తో కూడిన వాచ్ ధరించి మరింత అందంగా కనిపించారు.
ఈ వాచ్ సమంతా రూత్ ప్రభు లుక్‌ని మరింత ప్రత్యేకంగా చేస్తోంది. అయితే దీని ధర కూడా ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఖరీదైన వాచ్ బల్గారీ సెర్పెంటి స్పిగా బ్రాండ్‌కు చెందినది. దానిపై వజ్రాలు చేర్చబడ్డాయి. ఈ వాచ్ సిల్వర్ ఒపలైన్ డయల్, స్పైరల్ బ్రాస్‌లెట్‌ను కలిగి ఉంది.
వాచ్ ధర రూ.70 లక్షలు.
ఈ స్పెషల్ బల్గారీ సర్పెంటి మోడల్ వాచ్ ధర రూ.70 లక్షలు అన్నట్లుగా తెలుస్తోంది. ఇది విన్న నెటిజన్లు ఈ ధరతో ఢిల్లీ-NCRలో 3 BHK ఇంటిని కొనుగోలు చేయొచ్చు అని షాకవుతున్నారు. సమంత తన ఫ్యాషన్ స్టైల్‌తో కోట్లాది మందికి స్ఫూర్తినిస్తోంది.
సమంత హెయిర్ స్టైల్
సమంతా రూత్ ప్రభు తన చేతులకు లేయర్డ్ సిల్వర్ హోప్స్ , మ్యాచింగ్ రింగులను జత చేసింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సామ్ 'హ్యాపీ నౌ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Also Read: Vakeel Saab : పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. వకీల్ సాబ్ రీ రిలీజ్