Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..!

నటి ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో తరచూ డిఫరెంట్ స్టైల్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఫ్యాషన్ ప్రియులను అవాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ధరించిన మ్యాజికల్ బ్లాక్ గౌన్ సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నటి సమంత సైతం ఉర్ఫీ ఫ్యాషన్ కు ఫిదా అయ్యారు.

New Update
Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..!

Magical Gown : సోషల్ మీడియా(Social Media) లో యాక్టీవ్ ఉండే వారికి నటి ఉర్ఫీ జావేద్(Urfi Javed) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో తన విభిన్నమైన ఫ్యాషన్ సెన్స్ తో దర్శనమిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటోంది ఈ బోల్డ్ బ్యూటీ.

మూవీ ఈవెంట్స్, అవార్డు ఫంక్షన్స్, టీవీ షోస్ ఇలా ఏ ఈవెంట్ లో నైన ఉర్ఫీ తన కొత్త రకమైన స్టైల్, విభిన్నమైన కాస్త్యుమ్స్ లో ఫ్యాషన్ ప్రియులు అవాక్కయేలా చేస్తుంది. వైవిధ్యం.. వెరైటీ.. విల‌క్ష‌ణమైన ఫ్యాషన్ సెన్స్ కలిగిన ఈ బ్యూటీ ఫ్యాషన్ ఐకాన్ గా అభిమానుల హృదయాలను దోచుకుంటోంది.

తాజాగా రెడ్ కార్పెట్ ఈవెంట్ లో ఈ బ్యూటీ ధరించిన డ్రెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పసుపు రంగు పువ్వులు, సీతాకోకచిలుకలతో అలంకరించిన బ్లాక్ మ్యాజికల్ గౌన్ ధరించింది. ఆమె డ్రెస్ పై ఉన్న ఈ అందమైన సీతాకోకచిలుకలు రెక్కలు విదిలిస్తూ అబ్బురపరిచేలా కనిపించాయి.

ఉర్ఫి మ్యాజికల్ గౌన్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు ఈమె డ్రెస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సైతం మ్యాజికల్ ఉర్ఫి గౌన్ చూసి ఫిదా అయిపోయారు.

publive-image

బ్లాక్ మ్యాజికల్ గౌన్ లో ఉర్ఫీ లుక్ ను ప్రశంసిస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సామ్. 'బ్యూటీఫుల్ ఉర్ఫీ' అంటూ ఆమె వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

publive-image

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

Also Read: Anushka Sharma : ఆర్‌సీబీ టీమ్‌తో అనుష్క బర్త్‌ డే సెలబ్రేషన్స్‌.. ఫొటోలు వైరల్

Advertisment
తాజా కథనాలు