/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-16T161716.288-jpg.webp)
Allu Arjun: పుష్ప తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. బన్నీకి ప్రపంచస్థాయిలో గుర్తింపును తెచ్చింది. రీసెంట్ గా ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న.. అల్లు అర్జున్ టాలీవుడ్ చరిత్రలో రికార్డు క్రియేట్ చేశారు. అయితే తాజాగా అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం లభించింది.
74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానం
జర్మనీలోని బెర్లిన్ లో నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన "74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్" లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ కు ఆహ్వానం వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌కు టాలీవుడ్ నుంచి వెళ్తున్న ఏకైక హీరో బన్నీ కావడంతో.. మరో సారి ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో 'పుష్ప' స్పెషల్ స్క్రీనింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జర్మనీ బయలుదేరిన అల్లు అర్జున్.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
Also Read: Rashmika Mandanna: అరుదైన ఘనత సాధించిన రష్మిక.. ‘ఫోర్బ్స్ అండర్ 30’ లో చోటు
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే పుష్ప 2 నుంచి విడుదలైన అల్లు అర్జున్ పోస్టర్ సినిమా పై అంచనాలను మరింత పెంచేసింది. పార్ట్ 1 కు మించి పుష్ప 2 ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Icon star 🌟 @alluarjun is en route to Germany 🇩🇪 to represent the richness of Indian cinema at a prestigious film festival in Berlin.#AlluArjun #Pushpa2TheRule #Pushpa pic.twitter.com/5YbyfcCfPO
— Eluru Sreenu (@IamEluruSreenu) February 15, 2024
Also Read: Paayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో