Gold Rates Today: మహిళలు గుడ్‎న్యూస్...భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..!

బంగారం కొనాలనే ప్లాన్ ఉంటే వెంటనే కొనేయ్యండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. వెండిపై ఏకంగా 12వందలు తగ్గగా...బంగారం పై మూడు నాలుగు రోజుల్లో 3వేల వరకు తగ్గింది.

New Update
Gold Rates Today: మహిళలు గుడ్‎న్యూస్...భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..!

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పసిడి ధర భారీగా తగ్గింది. ఈ భారీ తగ్గింపులో బంగారం మీ సొంతం చేసుకోండి. అవును మేము చెప్పేది నిజమే. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. అందుకే బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెబుతున్నాం.

కాగా తెలుగు రాష్ట్రాల్లో పసడి ధరలు భారీగా పడిపోయాయి. వారం రోజుల్లో చూస్తే బంగారం ధర భారీగా దిగివచ్చింది. వెండి కూడా అదే కోవాలోకి వచ్చింది. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి ఇదే మంచి సమయం. ఈ భారీ తగ్గింపు ధరల నేపథ్యంలో మీరు వెంటనే పసిడిని కొనండి.

ఇది కూడా చదవండి: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

ఇక హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో ఓసారి చూస్తే...పసిడిలో మెరుపు తగ్గింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు చూస్తే..బంగారం ధరలు భారీగానే తగ్గాయి. వెండి కూడా నేలచూస్తోంది. అందుకే బంగారం ప్రియులకు ఇది ఊరటనిచ్చే వార్త. ఇక సిల్వర్ ధరలను చూస్తే..వారం రోజుల్లో 3,300పతనమైంది. వారం రోజుల్లో ఒక్కరోజు మాత్రమే పెరిగింది. ఐదురోజుల్లో భారీగా తగ్గింది. దీంతో వెండి కిలో ధరరూ. 79, 300 నుంచి నుంచి 76వేలకు దిగివచ్చింది.

అటు బంగారం విషయానికి వస్తే...గడిచిన వారం రోజుల్లో ఒక్కరోజూ కూడా ధర పెరగలేదు. రెండు రోజులు స్థిరంగా ఉంటే...ఐదురోజులు భారీగా తగ్గింది. మొత్తంగా 1750 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 59, 950 నుంచి 58, 200లకు తగ్గింది. ఇది 24 క్యారెట్ల బంగారం ధరకు వర్తిస్తుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 54, 950 నుంచి 53,350కి దిగి వచ్చింది. దీంతో 1600 వరకు తగ్గింది. ఇది 10గ్రాముల రేటుకు వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: రోజూ చపాతీ తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా?

వచ్చేది పండగ సీజన్. దసరా, దీపావళికి బంగారం కొనాలనే ప్లాన్ ఉంటే కొనేయ్యండి. అందుకే బంగారం, వెండి కొనేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదంటే ధరలు మళ్లీ పెరిగి ఛాన్స్ లేకపోలేదు.

Advertisment
తాజా కథనాలు