Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నాలుగు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు

దేశీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది.

New Update
Stock Market Review: రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఇన్వెస్టర్లకు పండగే!

Stock Markets Crash : కొన్ని రోజులగా స్టాక్ మార్కెట్లు(Stock Markets) అటుఇటుగా కదులుదున్నాయి. ఒక రోజు లాభాల్లో ఉంటే, మరో రోజు నష్టాల్లో ఉంటున్నాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల(Asia Markets) లో ప్రతికూల కదలికలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దాంతో పాటూ వాల్‌స్ట్రీట్(Wall Street) లో అనిశ్చితి కూడా మన మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఏప్రిల్ డెరివేటివ్స్ సిరీస్ నెలవారీ F&O గడువు ఈ రోజు ముగుస్తుంది. దీంతోపాటు గ్లోబల్ మార్కెట్ల సూచనలు, Q4 FY24 ఫలితాలను ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ట్రాక్‌ చేస్తారు. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. ఈ ఉదయం జపాన్‌కు చెందిన నికాయ్‌ 1.7 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 1 శాతం క్షీణించాయి. హాంగ్ సెంగ్, షాంఘై కాంపోజిట్ 0.3 శాతం వరకు పడిపోయాయి.యూఎస్‌లో నిన్న S&P 500 0.02 శాతం లాభపడగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.11 శాతం పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.1 శాతం పెరిగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌ స్టాక్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు...

గత కొద్ది రోజులుగా విపరీతంగా పెరిగి భయపెట్టిన బంగారం ధరలు(Gold Rates) నాలుగు రోజులుగా వరుసగా తగ్గముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కాస్త శాంతించడం బంగారం ధరల మీద ప్రభావం చూపించింది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2320 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర తగ్గి 27.27 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ మళ్లీ పెరిగింది.ప్రస్తుతం ఇది రూ. 83.345 వద్ద ఉంది.హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన బంగారం రేటు రూ. 66,600 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం రేటు మాత్రం ఒక్కరోజులో రూ. 490 ఎగబాకి తులానికి ఇప్పుడు రూ. 72,650 మార్కు వద్ద ఉంది.  బంగారం ధర పెరిగినప్పటికీ  వెండి రేట్లు మాత్రం తగ్గాయి. ఢిల్లీలో ఒక్కరోజులో సిల్వర్ రేటు రూ. 100 తగ్గి ప్రస్తుతం కిలోకు రూ. 82,900 వద్ద ఉంది. హైదరాబాద్‌లో కూడా రూ. 100 పడిపోయి ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 86,400 వద్ద ట్రేడవుతోంది.

Also Read:Elections: రెండోదశ పోలింగ్..13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు ఓటింగ్