CM Revanth Reddy : నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కరెంట్ కోతలపై ఆరోపణలను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరెంట్ పై దృష్టి పెట్టింది. నేడు ఉదయం విద్యుత్ శాఖ సీఎండీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.

CM Revanth Reddy : నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!
New Update

తెలంగాణ ఎన్నికల్లో 24గంటల కరెంట్ అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య విమర్శలకు దారి తీసింది. తాము కూడా 24గంటల ఉచిత కరెంట్ అందిస్తామని కాంగ్రెస్ చెప్పినా బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ గెలుస్తే 3గంటల కరెంట్ మాత్రమే సాగుకు అందుతుందని కేసీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలంతా ప్రచారం చేశారు. కర్నాటకలో 5గంటల కరెంట్ మాత్రమే ఉందని ప్రచారం చేశారు. అయినా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తొలి మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చింది. 24గంటల కరెంట్ అందిస్తామని భేటీ తర్వాత, మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై ఫైర్ అయ్యారు. విద్యుత్ ఉత్పత్తి, వేరే రాష్ట్రాల నుంచి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు దాచిపెట్టారని మండిపడ్డారు. దీనికి సంబంధించి రూ. 85వేల కోట్లు అప్పు ఉందని అధికారులు చెప్పారు. దీంతో ఈ వివరాలను దాచారని, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తెచ్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వివరాలు అడగ్గా...తాను అన్ని డాక్యుమెంట్లు సమాచారం లేదని కార్యదర్శి వివరించినట్లు తెలిసింది. దీంతో సీఎం ఈరోజు ఉదయం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

సీఎండీ ప్రభాకార్ రావు రాజీనామాను ఆమోదించరాదని..ఆయనను కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనాలని కోరారు. ప్రభాకర్ రావును రప్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. విద్యుత్ శాఖపై సీఎం సీరియస్ గా ఉన్నారని అర్థమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని వదంతులు ప్రచారం అవుతున్నాయి. కరెంట్ కోతలు మళ్లీవస్తాయని, పింఛన్లు, రైతు బంధు డబ్బులు కూడా ఆలస్యంగా పడతాయని ప్రచారం జోరుగా సాగుతోంది.

కాగా పరిపాలనలో ముఖ్యంగా సేవల్లో, పథకాల్లో ఎలాంటి తేడా కనిపించినా కాంగ్రెస్ పై నిందపడే ఛాన్స్ ఉంది. అందుకే సీఎం చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. విద్యుత్ శాఖలో భారీ స్థాయిలో అప్పు ముందుకు రావడంతో సీఎం షాక్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నేడు ఉదయం భేటీ కానున్నారు. కాంగ్రెస్ 24గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినన్ని రోజులు ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఏ కారణం చేతనైనా విద్యుత్ సేవలు అందకుంటే మాత్రం తప్పు కాంగ్రెస్ పైనే పడే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ములుగులో ట్రైబల్ యూనివర్సిటీకి లోకసభ ఆమోదం

#cm-revanth-reddy #revanth-reddy #telangana-cm-revanth-reddy #telangana-cabinet-meet #free-electricity #24-hours-electricity #cmd-prabhakar #power-dept #power-issues
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe