Kavitha - Kejriwal : నేడే కవిత, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు.. ఊరట దక్కుతుందా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు రానుంది. ఈడీ ఈ ఇద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని.. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదిస్తోంది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్? .. టెన్షన్‌లో బీఆర్ఎస్ శ్రేణులు
New Update

Bail Petition Judgement : ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బెయిల్‌ పిటిషన్‌పై నేడు ఢిల్లీ(Delhi) రౌస్‌ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో విచారణ జరగనుంది. కవిత పిటిషన్‌ను జడ్జి కావేరి బావేజా(Kaveri Baweja) విచారించనున్నారు. తన కుమారుడికి పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్‌ కోరుతూ కవిత పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీని ఆదేశించింది. ఈడీ గడువు కోరడంతో విచారణ ఇవాల్టికి వాయిదా పడింది.

కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ వాదిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె కీలకమని చెబుతోంది. మరో వైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) బెయిల్ పిటిషన్ పై సైతం నేడు తీర్పు రానుంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో కవిత, కేజ్రీవాల్ సన్నిహిత వర్గాల్లో న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read : కవితకు మరో షాక్

#delhi #aravind-kejriwal #mlc-kavitha #bail-petition
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe