Telangana Elections 2023:తుది అంకానికి చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం...ఈరోజే లాస్ట్

ఎన్నికలు..ప్రచారాలు..సభలు..కేంద్రం నుంచి నాయకుల రాకతో నెలరోజులగా తెలంగాణ అంతా హడావుడిగా ఉంది. ఈరోజుతో దానికి తెరపడనుంది. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది.

New Update
Telangana Elections 2023:తుది అంకానికి చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం...ఈరోజే లాస్ట్

ఏ ఎన్నికలకైనా కీలకమైనది ప్రచారం. ఇది ఎంత బాగా జరిగితే అంతలా ఓటర్లను ఆకర్సించుకోవచ్చును. దీని కోసం అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తాయి, చేసాయి కూడా. నెల రోజులుగా ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాణ రేపటి నుంచి సైలెంట్ అయిపోనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకే ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. మరో రెండు రోజుల్లో అంటే నవంబర్ 30న తెలంగాణ అంతటా పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ కు ముందు ఈసీ నిబంధనల ప్రకారం 48 గంటల ముండు ప్రచారాన్ని నిలిపివేయాలి. దీంతో మైక్‌లు బంద్ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్​అమల్లోకి వస్తుంది. మరోవైపు పోటీ చేస్తున్నవారు తప్ప మిగతా పార్టీకి చెందిన వారు ఎవ్వరూ నియోజకవర్గాల్లో ఉండకూడదని ఎలక్షన్ కమీషన్ స్పష్టం చేసింది. దీంతో అన్ని పార్టీలు చివరి రోజున బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్‌లతో సుడిగాలి ప్రచారాలు నిర్వహించాలని డిసైడ్ అయిపోయాయి. ఇప్పటికే దఫాలుగా అభ్యర్థులు, స్టార్​ క్యాంపెయినర్లు నియోజకవర్గాలను చుట్టేశారు. ఆఖరి ప్రయత్నాల్లో భాగంగా ఊరూవాడల్లో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో హడావుడి చేయనున్నారు.

Also Read:పోలింగ్ డే రోజున ఓటర్లకు ర్యాపిడో ఉచిత సేవలు

ఈరోజు కూడా కాంగ్రెస్​, బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. రాహుల్​ గాంధీ రోడ్​ షోలలో పాల్గొంటారు. చివరిరోజు కావడంతో కాంగ్రెస్ అగ్రనేతలంతా ప్రచారాల్లో ఫుల్ బిజీగా ఉండనున్నారు. రోడ్ షో, కార్నర్ మీటింగ్స్‌లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉదయం పదిన్నరకు జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్ యూనియన్, జీహెచ్‌ఎంసీ, గిగ్ వర్కర్స్ యూనియన్‌తో ఇంటరాక్షన్ అవుతారు. పదకొండున్నరకు నాంపల్లిలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. 2 గంటలకు మల్కాజిగిరి ఆనంద్ బాగ్ చౌరస్తా లో ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు జహీరాబాద్‌లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. అలాగే కామారెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి అరోజు పర్యటించనున్నారు. కామారెడ్డి పట్టణం, దోమకొండలలో రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇలా విడివిడిగా అయిన తర్వాత ముగ్గురు ముఖ్య నేతలు కలిసి మల్కాజ్‌గిరిలో రోడ్ షో లో పాల్గొంటారు. ఇవన్నీ సాయంత్రం 5 లోపునే ముగించనున్నారని తెలుస్తోంది.

ఇక బీజేపీ విషయానికి వస్తే పార్టీ పెద్దలంతా చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మోదీ వెళ్ళిపోయినప్పటికీ మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు సాద్వి నిరంజన్, భగవత్ కిషన్ రావు సైతం హాజరుకానున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ కూడా వరంగల్‌, గజ్వేల్‌లో పర్యటించనున్నారు. రెండు చోట్లా ప్రజాశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడనున్నారు.

ఏం చేసినా ఈరోజు సాయంత్రం 5 వరకే చేయాలి. ఆ తర్వాత ఏ నేతా లేదా స్టార్ క్యాంపెనర్లు ఎవ్వరూ కూడా ఎన్నికలకు సంబంధించన వ్యవహారల మీద మాట్ఆడకూడదు. మీడియాతో, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహించకూడదని ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పార్టీలు తదుపరి కార్యచరణకు రెడీ అయిపోతున్నాయి. వచ్చే రెండు రోజులు ప్రలోభాల పంపిణీ మీద దృష్టి సారించాలని డిసైడ్ అయ్యాయి. ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో పాటూ పోల్ మేనేజ్ మెంట్‌కు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లకు భారీగానే డబ్బులు పంచడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. చాలాచోట్ల ఒక్కో ఒటర్‌కూ 3 నుంచి 5 వేల చొప్పున ఇవ్వనున్నారని సమాచారం. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఇది మొదలైపోయిందని తెలుస్తోంది. ఇక పోలింగ్ ముందు రోజు రాత్రి మద్యం పంచుతారని చెబుతున్నారు. అయితే రూల్స్ ప్రకారం ఇవి నిషిద్ధం. మరి ఎన్నికల కమీషన్ వీటిని ఎంత వరకూ నియంత్రిస్తుందో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు